మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం.
భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు మునగాకు పొడినీ బోనస్‌గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందనీ పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయనీ చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య కోకొల్లలు.
ఆనోటా ఈనోటా ఇది మనవరకూ వచ్చింది. ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాద’న్నట్లు నిన్నమొన్నటివరకూ మనం మునగ చెట్టుని పెద్దగా పట్టించుకోలేదు. తలపైకెత్తి దానివైపే చూడలేదు- సాంబారులోకి నాలుగు కాయలు అవసరమైనప్పుడు తప్ప. కానీ అమెరికాకి చెందిన ‘ద ట్రీస్ ఫర్ లైఫ్’ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. దానికి పలు అంతర్జాతీయ సంస్థలూ శృతి కలిపాయి. ప్రపంచ దేశాలకు ఆ సంజీవని గురించి కథలుగా చెప్పడం ప్రారంభించాయి.
ఐక్యరాజ్యసమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. దాంతో మన దృష్టీ అటు మళ్లింది. న్యూట్రిషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సి.గోపాలన్, డాక్టర్ కమలా కృష్ణస్వామిలు మునగాకు లోగుట్టుని విప్పారు. వారికి ఆయుర్వేద వైద్యులూ తోడయ్యారు. అంతా కలిసి మరీ ‘మునగ’ మహత్యాన్ని కొనియాడుతున్నారు.
ఏముంది మునగాకులో..?
‘బతికుంటే బలుసాకు తినొచ్చు’... ఓ పాత నానుడి. ఆ బలుసాకు ఏమోగానీ, ‘రోజూ కాస్త మునగాకు తింటే చాలు, వందేళ్లు బతకొచ్చు అన్నది కొత్త సామెత. ఎందుకంటే...
వంద గ్రా. తాజా మునగాకుల్లో... నారింజల్లోకన్నా ఏడు రెట్లు సి-విటమిన్, క్యారెట్లలోకన్నా నాలుగింతల కాల్షియం, అరటిపండ్లలోకన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలోకన్నా మూడింతల ఐరన్, బాదంలోకన్నా మూడు రెట్లు విటమిన్- ఇ, పెరుగులోకన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి.
అంటే ఇరవై గ్రా.మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఎ,సి-విటమిన్లూ, వంద గ్రా.ఆకు నుంచి కాల్షియం, మూడొంతుల ఐరన్, సగం ప్రొటీన్లూ దొరుకుతాయి.
అందుకే పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు. ఆ కారణంతోనే క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో మునగ చెట్లను పెంచి, ఆ కాయల్ని రోజూ తినేవాడట. ‘ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు... మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ...పేదవాడి ఆహారం’ అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలూ రాశాడు క్యాస్ట్రో. ఇప్పుడు క్యూబా వాసులు మునగాకుని పండించి, పొడి చేసి విక్రయిస్తున్నారు. భారత్ కూడా మునగ ఆకుల పొడిని ఎగుమతి చేయడం ప్రారంభించింది. కానీ ఆకుని తినడం పట్ల ఇప్పటికీ మనదగ్గర అలసత్వమే.
నిజానికి ప్రాచీన కాలం నుంచీ ఆఫ్రికా దేశాల్లోనూ భారత్‌లోనూ తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉంది. మధ్యలో మాయమై, మళ్లీ తెరమీదకొచ్చింది. టైమ్ మ్యాగజైన్ ‘ద నెక్స్ట్ క్వినోవా’గా అభివర్ణించింది. దాంతో పాశ్చాత్య దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూతీలూ సలాడ్ల మీద చల్లుకోవడం, టీ, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారు.
Contd.Page.2
Page.No.2
ఎందుకంటే...
100 గ్రా. ఎండిన ఆకుల్లో... పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం, అరటిపండ్లలోకన్నా 15 రెట్లు పొటాషియం, క్యారెట్లలోకన్నా 10 రెట్లు విటమిన్-ఎ, పాలకూరలోకన్నా 25 రెట్లు ఐరన్... ఇలా చాలా లభిస్తాయి.
మునగాకుని ఎండబెట్టి పొడి చేసుకునే తినాల్సిన అవసరం మనకి లేదు. తాజా మునగాకు పుష్కలం. ఒకప్పుడు శుభసూచకం కాదన్న కారణంతో పెరట్లో మునగ పెంచేవారు కాదు. కాలం మారింది. పట్టింపూ పోయింది. దాంతో కాయలకోసం చాలామందే పెంచుతున్నారు. కాబట్టి ఇతర ఆకుకూరల్లానే మునగాకుతో పప్పూ కూరలూ పచ్చళ్లూ పొడులూ రైస్ వెరైటీలూ కోఫ్తాలూ... అన్ని రకాలూ వండుకోవచ్చు. దోసెల్లో రొట్టెల్లో దట్టించినా రుచే. పొడిని టీ రూపంలో తాగొచ్చు, సూపుల్లో అన్నంలో కూరల్లో... ఎలా కావాలంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచెక్కువ. కాబట్టి కుక్కర్లో ఉడికించాలన్నది నిపుణుల సలహా.
ఔషధగుణాలెన్నో...
మరే చెట్టు ఆకులకీ లేనంత మహత్తు మునగాకుకి ఉంది. ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. మునగాకులో రోగనిరోధకశక్తిని పెంచే 46 యాంటీఆక్సిడెంట్లూ అనేకానేక బయోయాక్టివ్ పదార్థాలూ ఉండటంతో శాస్త్రవేత్తలు దీనిమీద పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులోని ఓషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్‌లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లూ అల్సర్లూ కనుచూపుమేర కనిపించవు. ఆల్జీమర్స్ ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ దరి చేరడానికి భయపడతాయి. గాయాలన్నీ మునగాకు పేస్టుతో గాయబ్.
అంతేనా... రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకునో లేదా టీస్పూను పొడినో రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్ వృద్ధి, రక్తం సమృద్ధి. ఈరోజుల్లో పసివయసు దాటకుండానే కంటిజబ్బులనేకం. రేచీకటి బాధితులూ ఎక్కువే. వాటన్నింటినీ మునగాకులోని బీటాకెరోటిన్ నివారిస్తుందని ఇంటర్నేషనల్ ఐ ఫౌండేషన్ అంటోంది.
ఇంటాబయటా అంతటా ధూళిమేఘాలే... కాలుష్యకాసారాలే. మరి ఆస్తమా, బ్రాంకైటిస్, ట్యుబర్క్యులోసిస్ పిలవకుండానే పలుకుతున్నాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయి. అందుకే ఆకుల్ని సూపులా చేసుకుని రోజుకి రెండుసార్లు తీసుకుంటే లంగ్సులోని టాక్సిన్లు తొలగి, ఆ వ్యాధులన్నీ పారిపోతాయి.
రజస్వలానంతరం అమ్మాయిలకి ఎన్ని కష్టాలో... కొందరిలో నెలసరి సమయంలో గడ్డలు పడుతుంటాయి. అప్పుడు ఆకులతో చేసిన సూపుని 21 రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే సరి. మునగాకు రసం తాగితే గర్భసంచి సాగకుండా ప్రసవం సులభంగా అవుతుంది. పాలుపడని బాలింతలకి కాసిని నీళ్లలో ఉప్పు, మునగాకులు వేసి కాసేపాగి ఆ నీటిని వంపేసి ఆకుల్ని నేతితో తినిపిస్తే ఫలితం ఉంటుంది. పొడి రూపంలో ఇచ్చినా పాలు పుష్కలమే.
డయేరియా, కామెర్లూ, కలరా బాధితుల బాధ కాదు. ఒకటే దాహం. నీరసం. అప్పుడు రోజుకి రెండుమూడుసార్లు గ్లాసు కొబ్బరినీళ్లలో టీస్పూను మునగాకు రసం, కొద్దిగా తేనె కలిపి తాగితే సరి. మూత్ర సమస్యలకీ మునగ బెస్ట్ మెడిసినే. ఆకుల్ని ముద్దలా చేసి క్యారెట్ రసంలో కలిపి పదిగంటలకోసారి తీసుకుంటే హానికర బాక్టీరియా, వైరస్‌లన్నీ తొలగిపోతాయి.
ఆకుల్ని కణతలకి రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమలమచ్చలు, బ్లాక్‌హెడ్స్ మీద రాస్తే అవి మాయమై చర్మం మెరుస్తుంది. స్కర్వీ, చర్మవ్యాధులు, ఆందోళనలకి మునగాకు టీ రుచికరమైన పరిష్కారం.
Contd.Page.3
Page.No.3
వహ్వా... మునక్కాడ!
సీజన్లో చిటారుకొమ్మ వరకూ చిగురు కనబడకుండా కాసిన కాయలు చూసేవాళ్లకి కన్నులపండగ అయితే, ఆ కాయల రుచి తెలిసినవాళ్లకి విందుభోజనమే. దక్షిణాదిన సాంబారు, పులుసు, అవియల్ వంటల్లో మునక్కాడ కనిపించాల్సిందే. ఇక, బియ్యప్పిండి, బెల్లం లేదా అల్లంవెల్లుల్లి వేసి వండే మునగగుజ్జు కూర ఎవరికైనా నోరూరాల్సిందే. మునక్కాడలతో పట్టే నిల్వ పచ్చడి మహారుచి. మటన్‌లో మునక్కాడ పడితే నాన్‌వెజ్ ప్రియులకి పండగే. ఆకులతో పోలిస్తే కాయల్లో పోషకాల శాతం తక్కువే. కానీ మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఎక్కువే.‘ఈ ఒక్క మునక్కాడ తినవూ బోలెడు బలం’ అంటూ బామ్మలు బతిమిలాడి తినిపించడం చాలామందికి అనుభవమే. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అది నిజమే. మునక్కాడల్లోని యాంటీబయోటిక్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే; కాల్షియం, ఐరన్లు ఎముకబలాన్నీ బరువునీ పెంచుతాయి. రక్తంలో చక్కెర శాతాన్నీ తగ్గిస్తాయి. పిత్తాశయం యమా జోష్‌గా పనిచేస్తుంది.
శస్త్రచికిత్సానంతరం మునగాకునీ, మునక్కాడలనీ తింటే త్వరగా కోలుకుంటారని చెప్పడం తెలిసిందే. దానిక్కారణం మరేంటో కాదు, మునక్కాడల్లోని ఐరన్‌వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందట. మునక్కాడల్ని మరిగించిన నీళ్లతో ఆవిరిపట్టడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలూ తగ్గుతాయి. వీటిని ఉడికించిన నీరు తాగితే చర్మం మెరుస్తుందట.
‘తరచూ జలుబు చేస్తోందా... జ్వరమొస్తోందా... అయితే రోజూ మునక్కాడలు తినండొహో’ అంటూ చాటింపు వేస్తున్నారు ఆధునిక వైద్యులు. వాటిల్లోని విటమిన్-సి జలుబూ ఫ్లూ జ్వరాలకి ట్యాబ్లెట్లా పనిచేస్తుందట. వీటిని ఎక్కువగా తినేవాళ్లకి పొట్టలో నులిపురుగుల బాధ ఉండదు. ఈ ముక్కలను ఉడికించిన సూప్ డయేరియాకి చక్కని నివారణోపాయం. కీళ్లనొప్పులయితే పరారే. కాలేయం, ప్లీహ సంబంధిత వ్యాధులన్నీ హాయ్ చెప్పడానికే సందేహిస్తాయి.
‘ఏమోయ్... ఇంకా పిల్లల్లేరా... అమ్మాయిని మునక్కాయ కూర వండమనోయ్...’ అని ఏ పెద్దాయనో అంటే సరదాగా తీసుకోవద్దు. వీటిల్లోని జింక్ స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వాన్ని తగ్గిస్తుంది. వీర్యం చిక్కబడుతుంది.
నియాసిన్, రిబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, పైరిడాక్సిన్ వంటి బి-కాంప్లెక్స్ విటమిన్లు మునక్కాడల్లోనూ సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి సంక్లిష్ట పిండిపదార్థాలూ ప్రొటీన్లూ జీర్ణమయ్యేలా చేస్తాయి.
ఏదేమైనా మునక్కాడలు ఎక్కువగా తినేవాళ్లలో రోగనిరోధకశక్తి ఎక్కువ. శ్వాససంబంధ సమస్యలు తక్కువ. వీటిల్లోని ప్రొటీన్లూ పీచూ కారణంగా పోషకాహార లోపమూ ఉండదు. నాడీవ్యవస్థా భేషుగ్గా పనిచేస్తుంది.
Contd.Page.4
Page.No.4
పూలు... తేనెలూరు..!
పచ్చదనంతో కళకళలాడే దీని ఆకులూ కాయలే కాదు, సువాసనభరితమైన తెల్లని పూలూ ఔషధ నిల్వలే. ఆయుర్వేద వైద్యంలో వాడదగ్గవే. పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్లతల్లుల్లో పాలు బాగా పడేలా చేస్తుంది. ఇది మూత్రవ్యాధుల నివారణకూ దోహదపడుతుంది. ఈ పూలను మరిగించిన తేనీరు జలుబుకి మంచి మందు. కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను సెనగపిండిలో ముంచి పకోడీల్లా వేస్తారు, కూరలూ చేస్తారు. మునగ పూలలో తేనె ఎక్కువ. దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి, తేనె ఉత్పత్తికీ తోడ్పడతాయి.
విత్తనంతో నీటిశుద్ధి..!
విరగ్గాసిన కాయలు ఎండిపోయాయా... ఫరవాలేదు, ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. విటమిన్-సి పుష్కలంగా ఉండే వీటిని వేయించి పల్లీల్లా తినొచ్చు. నూనె తీయొచ్చు. దీన్ని వంటనూనెగానూ సౌందర్యసాధనంగానూ ల్యూబ్రికెంట్‌గానూ వాడుతుంటారు.రక్షిత నీటి పథకాలు కరవైన ప్రాంతాలకు మునగ విత్తనాలే నీటిశుద్ధి పరికరాలు. కఠిన జలాల్ని సైతం ఈ గింజలు ఉప్పు లేకుండా తేటగా మారుస్తాయి. సూడాన్, ఇండొనేషియా వాసులు ఆ కారణంతోనే విత్తనాలను ప్రత్యేకంగా సేకరించి, ఆ గింజల్ని పొడిలా చేసి, కప్పు నీళ్లలో కలిపి, వడగడతారు. ఇప్పుడు ఈ నీళ్లను బిందెలోని నీళ్లలో కలిపి, ఓ ఐదు నిమిషాలు గరిటెతో కలుపుతారు. తరవాత ఓ గంటసేపు కదపకుండా ఉంచితే మలినాలన్నీ కింద పేరుకుని పైనున్న నీరంతా తేటగా అవుతుంది. వీటిని విడిగా పాత్రలో పోసుకుని తాగుతారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ పొడి కలిపిన ద్రవాన్ని నీటిలో కలపగానే అది పాలీ ఎలక్ట్రోలైట్‌గా పనిచేసి నీటిలోని మలినాలను అయాన్లుగా మార్చడం ద్వారా వాటిని ఆకర్షించి కింద పేరుకునేలా చేస్తుంది.ఇంకా... ఇంకా...!
మునగాకు మనుషులకే కాదు, పశువులకీ బలవర్థకమైనదే. పశువుల మేతగానూ పంటలకు ఎరువుగానూ వాడతారు. చెట్టు కాండం నుంచి వచ్చే గుజ్జుని కాగితం తయారీకి వాడతారు. ఆగ్రో ఫారెస్ట్రీకి మునగ చక్కగా సరిపోతుంది. పెద్దగా నీడ ఉండని ఈ చెట్ల మధ్యలో ఇతర పంటల్నీ వేసుకోవచ్చు. ఈ మొక్కల్ని కంచెలానూ పెంచవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని పెంచుతున్నా మునగ పంటలో మనదేశమే ఫస్ట్. ఏటా 13 లక్షల టన్నుల కాయల్ని పండిస్తున్నాం. రాష్ట్రాలకొస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మునగ ఉత్పత్తుల విలువ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.27వేల కోట్లు. వాటిల్లో 80 శాతం మనవే. కాయలతోబాటు పొడినీ ఎగుమతి చేస్తున్నాం. కాయల్ని శీతలీకరించి చక్కెరపాకంలో వేసి ఎగుమతి చేస్తారు.
మునగలో రకాలనేకం. కుండీల్లో కాసే హైబ్రిడ్ రకాలూ ఉన్నాయి. జాఫ్నా రకం కాయలు 60 నుంచి 120 సెం.మీ. వరకూ కాస్తే, ఆరునెలలకే పూతొచ్చి, కాయలు కాసే కెఎం-1, పీకేఎం-1, పీకెఎం-2, పీఏవీఎం రకాలూ వస్తున్నాయి. నేలతీరు, వాతావరణాన్ని బట్టి ఆయా రకాలని ఎంపికచేసుకుని ఈ చెట్లను పెంచి ఎకరాకి కనీసం లక్ష రూపాయల లాభాన్ని పొందుతున్నారు రైతులు. వ్యవసాయపరంగానే కాదు, ఇంటి అవసరాలకోసం పెరట్లోనో లేదంటే కుండీల్లోనో మునగను పెంచితే, రోజూ ఓ గుప్పెడు తాజా ఆకుల్ని కూరల్లో వేస్తే మీ ఆహారంలో సూపర్‌ఫుడ్ చేరినట్లే, మీకు డాక్టరుతో పనిలేనట్లే..!
మునగ గురించి ఇంతటి సమగ్రమైన సమాచారం అందించిన వారికి కృతజ్ఞతలు.
ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆ రోజు పగలంతా నియమనిష్ఠలతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిదులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు.
మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ, మాఘ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని, రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. “రా” అన్నది దానార్థక ధాతు నుండి “రాత్రి” అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద – రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ యిలా చెప్పబడింది – హే రాత్రే! అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక!… వగైరా –
‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!
ఉష ఋణేవ యాతయ||’
నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది. అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. Pమహా శివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో, ఆ రాత్రి జాగర్ణం వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటె ఆ భక్తుడు జీవన్ముక్తుడౌతాడని స్కందపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ.
‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!’
అందుకేనేమో గరుడ, స్కంద, పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది. వర్ణనలలో కొంత తేడా వుండొచ్చు. ప్రముఖ విషయం ఒకటే. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసంచేసి, బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో, రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము, తపము, యజ్ఞము, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు.
మహాశివరాత్రి రోజు ఉపవాసము, జాగరణ శివపూజ ప్రధానమైంది. అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి. అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థలు గోచరిస్తున్నాయి. వైదిక సాహిత్యంలో దీని అర్థం – వేద బోధితమని, ఇష్ట ప్రాపకర్మ అని వుంది. దార్శనిక గ్రంథాల్లో ‘అభ్యుదయ ‘ మని, ‘ నిః శ్రేయస్సు ‘ కర్మ అని, అమరకోశంలో వ్రతమంటే నియమమని వుంటే పురాణాల్లొ మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది. అన్నింటిని కలుపుకుంటే – వేదబోధిత అగ్నిహోత్రాది కర్మ, శాస్త్ర విహిత నియమాది, సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు. సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్ట దేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు.
మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత నిచ్చారు. అలా అని ‘ తిథితత్వం ‘ లో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు వుంది. – ‘ మీరు స్నానం చేసినా, మంచి వస్త్రాలు ధరించినా, ధూపాలు వెలిగించినా, పూజ చేసినా పుష్పాలంకరణ చేసినా వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకిష్టం ‘ అంటాడు శివుడు.
మరి ఉపవాసం అంటే ఏమిటి?
దగ్గర వసించటం, నివశించటం, ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే ఈ శ్లోకం.
మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత, శక్తులు, శివుడు తిరిగే సమయమన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పడు. ‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ, సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.
‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ
యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘
విషయాసక్తుడు నిద్రళొ వుంటే అనుద్లో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరన ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివ – పూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.
శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి, వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి – ‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!”
వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత దాతువులు – ఆవు పేడ – ఆవు పంచితము, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో ‘ఓం నమః శివాయ ‘ అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి. అగ్నిలో నువ్వులు, బియ్యము, నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. ఈ హోమము తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి. అందమైన శివకథలు వినవచ్చు. వ్రతులు మరొకసారి రథరాత్రి మూడవ, నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ ‘ అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి. ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే – ‘ పరమాత్మా! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. హే లోకేశ్వరా! శివ – భవా! నన్ను క్షమించు. ఈ రోజు నేను అర్జించిన పుణ్యమంతా, మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ! మా పట్ల ప్రసన్నులు కండి! మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.
అటు తర్వాత శివ భక్తులకు భోజనము. వస్త్ర, ఛత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి జరుపు కుంటున్నాం.
ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి, అవకాశం లేకపోతే, ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో, బిల్వదళాలతో అర్చించాలనీ, శక్తికొలదీ పాలు,గంగోదకం, పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ, ఉపవాస, జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు, శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానన్ని బోధించారు.
శివరాత్రికి లింగోద్భవకాలమని కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యొతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం . ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడం లోని ఉద్దేశం మన తనువునూ, మనసునూ కూడా శివార్పితం, శివాంకితం చేయడానికే. శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది.
శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు ‘ బిల్వ ‘ మూలంలో ఉంటాయనీ, శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు. శివరాత్రినాడు ఫలం, ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్త్యానుసారం బంగారం, వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు.
శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే, ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.
భారతీయుల ఙ్ఞానసంపద ఒక మహా సముద్రం… అందులో మన ఋషులు, మునులు, ఆచార్యులు, గురువులు, పెద్దలు రచించిన శ్లోకాలు నీటి బిందువులు వంటివి. అందులో రెండంటే రెండు నీటి బిందువులు చాలు… భారత దేశం “విశ్వగురువు” అని సగర్వంగా చెప్పడానికి.
1. హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం
2. గాయత్రి మంత్రం...
ముందుగా తులసీదాస విరచిత హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం గురించి మాటాడుకుందాం…
“యుగ సహస్ర యోజన పర భానూ!
లీల్యోతాహి మధుర ఫల జానూ”!!
దీని తాత్పర్యం సవివరముగా తెలుసుకుందాం…
యుగ= 12,000 దివ్య సంవత్సరములు
సహస్ర=1,000
యోజన్= 8 మైళ్ళు
యుగ x సహస్ర x యోజన= పర్ భాను
12,000 x 1,000 x 8 మైళ్ళు=9,60,00,000 మైళ్ళు
1 మైళు = 1.6 కిలో మీటర్లు
9,60,00,000 మైళ్ళు = 9,60,00,000 x 1.6 కిలో మీటర్లు =
15,36,00,000 కిలో మీటర్లు (ఇది భూమికి సూర్యునికి మధ్య దూరంగా కవి వర్ణన)
ఈ విషయాన్ని నాసావాళ్లు స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాకపోతే నాసా(NASA) శాస్త్రఙ్ఞులు భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని ఇంత ఖచ్చితంగా చెప్పలేదు. హనుమంతుడు భువి నుండి సూర్యుణ్ణి చూసి దానిని ఒక తినే పండుగా భావించి సూర్య మండలానికి చేరుకున్నాడని మన ఇతిహాసాలు తెలిపిన విషయాలలో వాస్తవికతను గ్రహించిన విదేశీయులు ఆశ్చర్యచకితులవుతున్నారు.
ఇప్పుడు గాయత్రీ మంత్ర మహిమ గురించి తెలుసుకుందాం. మహిమ అనంగానే అదేదో మ్యాజిక్కు, మాయ అని కాకుండా మహిమను ఙ్ఞానమార్గంగా తీసుకుందాం. అప్పుడే ఙ్ఞానాభివృధ్ధి కలుగుతుంది.
అమెరికన్ శాస్త్రవేత్త డా.హోవార్డ్ స్టెయిన్జెరిల్.. గాయత్రీ మంత్ర బీజాక్షరముల ధ్వనులపై తనయొక్క లేబొరేటరీలో పరిశోధన చేయగా అతడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు…
ఆయన తెలిపిన వివరాలు ఏంటంటే…
గాయత్రీ మంత్రం ఉఛ్ఛారణ జరుగుతున్నప్పుడు 1,10,000 ధ్వని తరంగాలు ఒక్క సెకనులోనే విడుదలయ్యాయని, ఈ ప్రపంచంలో మరే శ్లోకానికి గాని, పదాలకు గాని ఇంతటి శక్తి లేదని తేల్చి చెప్పాడు.
గాయత్రీ మంత్రోఛ్చారణ సమయంలో బీజాక్షర విస్ఫోటనం సంభవిస్తుంది. అది వినినా లేదా పఠించిన అయా వ్యక్తులకు మానసిక వికాసం పరిఢవిల్లుతుంది అని ఆ తర్వాత జరిపిన పరిశోధనల్లో కూడా అది స్పష్టమయింది.
ఈ విషయాన్ని గ్రహించిన ఎన్నో ఇతర దేశాలు గత రెండు సంవత్సరముల నుండి సూర్యోదయ సమయమందు పఠనం లేదా శ్రవణం చేయడం వారి జీవితాలలో ఒక భాగంగా చేసుకున్నారు.
వేల సంవత్సరాల క్రితమే మనకున్న విఙ్ఞానం అలాంటిది…!
ఇదీ మన భారత వైశిష్ట్యం…
ఇదీ మన వేద విఙ్ఞాన సారం…
ప్రతి భారతీయుడికి గర్వకారణం…
మన ఈ విఙ్ఞానాన్ని ప్రపంచానికి చాటుదాం… ----------------------------------------------------
Contd. Page.No.2
>Page.No. 2
కొద్దిగా కష్టం అనిపించినా పూర్తిగా చదవండి మంచి విషయం .............................#వారానికి 7 రోజులు ఎందుకు ?
రోజుకు 24 hours కదా hour అనే పదం ఎక్కడిది
ఆదివారం_తర్వాత_సోమవారం_ఎందుకు? మంగళ వారం రావొచ్చుగా ?
మనలో కూడా చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకుందాం ....
ప్రపంచంలో_ఏ_దేశానికి_లేని జ్ఞాన సంపద మన సొత్తు .ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుండిమిగతా దేశాలు వారు గ్రహాలు అంటే ఏంటో తెలియక ముందే నవ గ్రహలను గుర్తించిన ఘనత మనదే .
ఏ రోజు ఎప్పుడు సూర్యోదయం అవుతుంది ?
ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది ?
ఎప్పుడు_చంద్రగ్రహణం?
ఎప్పుడు_సూర్యగ్రహణం?
ఏ కార్తె లో ఏ పంట పండించాలి ఇవన్నీ కూడా మన భారతీయులు చేతి వేళ్ళు లెక్కలతో వేసి చెప్పినవే . ఎటువంటి పరికరాలు టెలిస్కోపులు లేకుండా సాధించినవే .
పైన_ప్రశ్న_కి_జవాబు:-
మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది . ఆది వారము, సోమ వారము, మంగళ వారము,బుదవారము, గురువారము, శుక్రవారము, శని వారము . ఇవి ఏడు . ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు
ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది . నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు . ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆ పేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి ఉన్నాయి .
భారత కాలమానంలో #హోరా అనగా ఒక గంట అని అర్థం .దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు #HOUR . ఒక రోజుకు 24 గంటలుంటాయి, అంటే 24 హోరాలు . ఒక రోజులో ఉన్న 24 గంటలు (24 హోరాలు) కూడా ఏడు హోరాల చక్రం లో తిరుగుతాయి .
ఆ 7 హోరాలకి ఏడు పేర్లున్నాయి .అవి వరుసగా (ఈ వరుసలోనే) శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి .
ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి . 7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక మల్లి మొదటి హోరాకి వస్తుంది . అంటే శని హోరా నుండి చంద్ర హోరాకి మల్లి శని హోరాకి .
ఉదాహరణకు ఆది వారము రవి హోరాతో ప్రారంభం అయి మూడు సార్లు పూర్తికాగా (3 సార్లు 7 హోరాలు 3x7 = 21 హోరాలు) 22 వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది . 23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది . 24 వ హోరా బుద హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది .
ఆతర్వాత హోరా 25వ హోరా, అనగా తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా . అనగా సోమవారము, అనగా చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది . ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది .
చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము . ఈ విధంగానే మిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి .
రవి (సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం, ఆదిత్య అన్న కూడా సూర్యుడు పేరే ...సో ఆదివారం, భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం (కర్ణాటక, తమిళనాడు లో భానువారం వాడుతారు) ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి .
ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి ? మంగళ వారమ్ రాకూడదా ? రాదు . ఏందుకంటే ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది, తరువాత రోజు అంటే సోమవారం చంద్ర హోరా తో ప్రారంభం అయ్యింది కాబట్టి ...
ఇది మన భారతీయుల గొప్పతనం .ఈ విషయాలు తెలియక మనల్ని మనం చిన్న చూపు చూసుకుంటాం .
ప్రపంచం లో దేశమయినా మన పద్దతి ఫాలో అవ్వాల్సిందే ! కానీ మనకి మాత్రం మనం అన్నా మన దేశమన్నా లోకువ .
ఇంత నిర్థిష్టమైన పద్ధతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారత దేశ సంప్రదాయాన్ని ప్రపంచ మంతా అనుసరిస్తున్నది .
నానోటేక్నాలజీ
ఇవాళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటీ అంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాలనాడే మన దేశంలో వుంది. ఇప్పటికీ వుంది. హిమాలయాల్లో సజీవంగా వుంది. వివరాల్లోకి వెళ్తే....
మన ఋషులు,యోగులు, సాధువులు కొన్ని వేల ఏళ్ళ క్రితమే సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు. మనం పుస్తకాల్లో చదువుకున్న తపస్సునే ఇప్పుడు ధ్యానం అంటున్నారు. ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అందులో ఒకటి సూక్ష్మ శరీరయానం. దీన్ని నానో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ స్టేజ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనల లక్ష్యం కూడా అదే. మన ఋషులు, యోగులు కోరుకున్నదే తడవుగా కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పటి హేతువాదులు దాన్ని నమ్మటానికి సిద్ధంగాలేరు.
మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం సన్నివేశం గుర్తుంది కదా. దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగినప్పుడు ,మాన సంరక్షణ కోసం తను శ్రీ కృష్ణుడిని ప్రార్ధిస్తుంది. ఎక్కడో ద్వారకలో వున్న కృష్ణుడు తక్షణం అక్కడ ప్రత్యక్షమై ద్రౌపది శీలాన్ని కాపాడుతాడు. దానికి ఆటను ఎంచుకున్న ప్రయాణ సాధనం నానో టేక్నాలజీయే. త్రిలోక సంచారి ఐన నారదుడు నిత్యం నానో టెక్నాలజీ ద్వారానే ప్రయాణించే వాడు. ఇదంతా చదివి నాకు మతి భ్రమించి రాస్తున్నాను అని మిత్రులు భ్రమపడే అవకాశం వుంది. అందుకే, ఇక్కడ ఒక సజీవ ఉదాహరణ ఇస్తున్నాను.
హరిద్వార్ లోనూ, త్రివేణి సంగమం లోనూ జరిగే కుంభమేళా లు గుర్తున్నాయి కదా. అక్కడికి లక్షలాది మంది నాగసాదువులు రావటం మనం టీవీల్లో,పేపర్ లలో చూశాం. నాగసాదువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో వుంటారు.మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి.
ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం.కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ,వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటి దాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు వుంటాయి. ఎక్కడైనా,ఏ ఫోటోగ్రాఫర్ కు అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కన్పించారా? ఎక్కడైనా ఇంతమంది ప్రత్యెక విమానాల్లో ,ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కన్పించాయా?లేదే? సరిగ్గా అందరూ ఒకేసారి, కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్ష మవుతారు? కుంభ మేలా ముగిశాక ,తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కన్పించి హటాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు?
వీటన్నింటికీ సమాధానం ఒకటే అదే సూక్ష్మ శరీర యానం .అదే నానో టెక్నాలజీ.నాగసాదువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం.ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే దాన్ని మనం నమ్మం. అమెరికా వాడు, రష్యా వాడు, చైనా వాడు, జపాన్ వాడు,జర్మనీ వాడు చెప్పే సోళ్లు అంతా విని చంకలు ఎగరేస్తుంటాం. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలు చదవండి. వాటిని అనుసరించి,అమలు చేసే ప్రయత్నం చెయ్యండి. ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు చెప్పొచ్చు .
నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత. ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పం యొక్క ముఖ్యత్వాన్ని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.
పుష్పాలతో దేవతలు ప్రసన్నులవుతుంటారు. ఎందుకంటే వారు పుష్పాలలో నివశిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పుష్పాలలో చైతన్యం ఉంటుంది.
ఇక, మన పురాణాలలో ఒక్కొక్క దేవతకు ఇష్టమైన పువ్వులను గురించి కూడ ప్రస్తావించబడింది. విష్ణువుకు, దుర్గాదేవికి, వినాయకుని రకరకాల పుష్పాలతో పూజించ వచ్చని పేర్కొనబడగా, శివునికి మాత్రం మారేడు ప్రతిచాలన్నట్లుగా చదువుతుంటాం. ఈ విషయాన్నే శ్రీనాథ మహాకవి వర్ణించాడు.
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటిపశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి, అంతటి బోళాశంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా?!
ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మసంగ్రాహం, శివరహస్యఖండం, లింగపురాణం, కార్తీకమాహాత్మ్యం గ్రంథాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఆ గ్రంథాలు ఇలా చెబుతున్నాయి.
శివుని పుష్పాలతో పూజిస్తే, పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. ఎవరైతే కనీసం ఎనిమిది పుష్పాలతో శివుని పూజిస్తారో వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది. శివుని పూజకు ఉపయోగించే పువ్వులు వాదిపోయినవిగా ఉండ కూడదు. కీటకాడులతో కొరకబదినవిగా ఉండేవి శివ పూజకు పనికిరావు. అలాగే ఇతరుల పూదోటలో పూచిన పువ్వులను దొంగతనంగా తీసుకువచ్చి పూజిస్తే ఫలితం కనిపించదు. ఇంకా పాపం కలుగుతుంది.
శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు, అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, గులాబి, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర, జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు, నందివర్థనం, నాగకేసరం, పొన్న, పచగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమపూవు, కుంకుమపూవు, ఎర్రకలువలు, నీలిపూలు శివపూజకు ప్రశస్తమైనవి. ఈ పుష్పాలతో ఏ పుష్పాన్ని సమర్పించినప్పటికీ శివ పరమాత్మ ఆనందంతో స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని స్వామివారే ఉమాదేవికి చెప్పినట్లు పురాణవాక్కు.
అదేవిధంగా శివుని ఏయే మాసాలలో ఏయే పూలతో పూజిస్తే ఏయే ఫలితం ఉంటుందన్న విషయాన్ని గురించి కూడ చెప్పబడింది. చైత్రమాసంలో శంకరుని నృత్యగీతాలతో సేవిస్తూ, దర్భ పువ్వులతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది. వైశాఖమాసంలో శివుని నేతితో అభిషేకిస్తూ తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధఫలం కలుగుతుంది.
జ్యేష్ఠ మాసంలో పెరుగుతో అభిషేకిస్తూ తామరపువ్వులతో పూజించిన వారికి పరమగతి కలుగుతుంది. ఆషాఢమాసంలో కృష్ణ చతుర్ధశినాడు స్నానం చేసి శివునికి గుగ్గిలంతో ధూపం వేసి తొడిమల తోడిమాలతో కూడిన పుష్పాలతో అర్చించినవారికి బ్రహ్మలోకాన్ని పరమపదం లభిస్తుంది. శ్రావణమాసంలో ఒంటి పూట భోజనం చేస్తూ గన్నేరుపూలతో శివుని పూజించినవారికి వేయిగోదానముల ఫలం లభిస్తుంది. భాద్రపద మాసంలో శివుని ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి చేరుకుంటారు. ఆశ్వయుజమాసంలో పరమశివుని జిల్లేడుపూలతో పూజించినవారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్యపదాన్ని చేరుతారు.
కార్తీకమాసంలో శివుని పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించినవారు శివపదాన్ని దర్శించుకుంటారు. మార్గశిర మాసంలో శివుని పొగడపూలతో పూజించినవారు, ముల్లోకాలను దాటి తామున్నచోటికే తిరిగిరాగలరు. పుష్యమాసంలో శివుని ఉమ్మెత్త పూలతో పూజించినవారు పరమ పదాన్ని పొందగలరు. మాఘ మాసంలో శివదేవుని బిల్వదళాలతో అర్చించినవారు, లేత సూర్యుడు, చంద్రుడులున్న విమాన,లో పరమపదానికి వెళతారు. ఫాల్గుణమాసంలో శివుని సుగంధజలంతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించినవారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది.
ఇక, శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు.
శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.
వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.
వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.
వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.
వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.
వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.
వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.
వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.
వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.
పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.
సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి. మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం. లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.
ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.
ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు. ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకాలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట. గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.
ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి.
మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.