Menu

        To Read Rera Act, 2016, select Muncipal related, scroll down and select RERA Act

Monday, September 3, 2018

భారతీయ శ్లోకాల్లో సైన్స్… ఆశ్చర్యపరిచే నిజాలు






భారతీయ శ్లోకాల్లో సైన్స్… ఆశ్చర్యపరిచే నిజాలు…

భారతీయుల ఙ్ఞానసంపద ఒక మహా సముద్రం… అందులో మన ఋషులు, మునులు, ఆచార్యులు, గురువులు, పెద్దలు రచించిన శ్లోకాలు నీటి బిందువులు వంటివి. అందులో రెండంటే రెండు నీటి బిందువులు చాలు… భారత దేశం “విశ్వగురువు” అని సగర్వంగా చెప్పడానికి.

1. హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం

2. గాయత్రి మంత్రం...

ముందుగా తులసీదాస విరచిత హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం గురించి మాటాడుకుందాం…

“యుగ సహస్ర యోజన పర భానూ!

లీల్యోతాహి మధుర ఫల జానూ”!!

దీని తాత్పర్యం సవివరముగా తెలుసుకుందాం…

యుగ= 12,000 దివ్య సంవత్సరములు
సహస్ర=1,000
యోజన్= 8 మైళ్ళు
యుగ x సహస్ర x యోజన= పర్ భాను
12,000 x 1,000 x 8 మైళ్ళు=9,60,00,000 మైళ్ళు
1 మైళు = 1.6 కిలో మీటర్లు
9,60,00,000 మైళ్ళు = 9,60,00,000 x 1.6 కిలో మీటర్లు =
15,36,00,000 కిలో మీటర్లు (ఇది భూమికి సూర్యునికి మధ్య దూరంగా కవి వర్ణన)

ఈ విషయాన్ని నాసావాళ్లు స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాకపోతే నాసా(NASA) శాస్త్రఙ్ఞులు భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని ఇంత ఖచ్చితంగా చెప్పలేదు. హనుమంతుడు భువి నుండి సూర్యుణ్ణి చూసి దానిని ఒక తినే పండుగా భావించి సూర్య మండలానికి చేరుకున్నాడని మన ఇతిహాసాలు తెలిపిన విషయాలలో వాస్తవికతను గ్రహించిన విదేశీయులు ఆశ్చర్యచకితులవుతున్నారు.

ఇప్పుడు గాయత్రీ మంత్ర మహిమ గురించి తెలుసుకుందాం. మహిమ అనంగానే అదేదో మ్యాజిక్కు, మాయ అని కాకుండా మహిమను ఙ్ఞానమార్గంగా తీసుకుందాం. అప్పుడే ఙ్ఞానాభివృధ్ధి కలుగుతుంది.

అమెరికన్ శాస్త్రవేత్త డా.హోవార్డ్ స్టెయిన్జెరిల్.. గాయత్రీ మంత్ర బీజాక్షరముల ధ్వనులపై తనయొక్క లేబొరేటరీలో పరిశోధన చేయగా అతడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు…

ఆయన తెలిపిన వివరాలు ఏంటంటే…

గాయత్రీ మంత్రం ఉఛ్ఛారణ జరుగుతున్నప్పుడు 1,10,000 ధ్వని తరంగాలు ఒక్క సెకనులోనే విడుదలయ్యాయని, ఈ ప్రపంచంలో మరే శ్లోకానికి గాని, పదాలకు గాని ఇంతటి శక్తి లేదని తేల్చి చెప్పాడు.

గాయత్రీ మంత్రోఛ్చారణ సమయంలో బీజాక్షర విస్ఫోటనం సంభవిస్తుంది. అది వినినా లేదా పఠించిన అయా వ్యక్తులకు మానసిక వికాసం పరిఢవిల్లుతుంది అని ఆ తర్వాత జరిపిన పరిశోధనల్లో కూడా అది స్పష్టమయింది.

ఈ విషయాన్ని గ్రహించిన ఎన్నో ఇతర దేశాలు గత రెండు సంవత్సరముల నుండి సూర్యోదయ సమయమందు పఠనం లేదా శ్రవణం చేయడం వారి జీవితాలలో ఒక భాగంగా చేసుకున్నారు.

వేల సంవత్సరాల క్రితమే మనకున్న విఙ్ఞానం అలాంటిది…!

ఇదీ మన భారత వైశిష్ట్యం…

ఇదీ మన వేద విఙ్ఞాన సారం…

ప్రతి భారతీయుడికి గర్వకారణం…

మన ఈ విఙ్ఞానాన్ని ప్రపంచానికి చాటుదాం… ----------------------------------------------------

Contd. Page.No.2

Pages: 1 2



No comments:

Post a Comment

Featured Post

Constitution of Functional Committees in Mandala Praja Parishads

If you dont view correctly plase cliks name of the document in pinck color RULES FOR THE CONSTITUTION OF FUNCTIONAL COMMITTEES IN EVERY M...

Popular Posts