Menu

        To Read Rera Act, 2016, select Muncipal related, scroll down and select RERA Act

Saturday, March 11, 2017

About Vedas


వేదం 90% శాతం మంది భారతీయులకు అసలు ఆ పదం గాని, అవి ఎన్నో కూడా తెలియదు..

మనం మరిచిపోయింది.. వేదాలనే కాదు.. ఒక మహా జాతి వైభావాన్ని..

వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం ఈ మాట నేను చెప్పటం లేదు.. విదేశీయులు చెప్తున్నారు.. జర్మనీ పార్లమెంట్ చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ చెప్తుంది..
ఎవడైనా వాగుతున్నాడా?? వేదాలను గురించి పిచ్చి పిచ్చిగా ?? మీ ముందు?? అయితే వాడిని ఒకటి పీకి.. ఈ పోస్ట్ చూపించండి...

శ్రీ బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !!

జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు" శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి"

ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, నాలుగు రూపాల్లో అవగతమవుతుంది.ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే. అంత అభినివేశం, ప్రతిభ ఉన్నవారుగా ఇరవయ్యో శతాబ్దంలో పేరుపొందిన వారు దండిభట్ల విశ్వనాథశాస్త్రి. అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్‌ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు!

రాజమహేంద్రవరం లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన - ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట. తనకు తెలియదని ఆ రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వనాథశాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్పపేరు ప్రతిష్టలు రావడానికి కారణమేమిటో కూడా చెప్పారు.

తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది. జర్మనీలో కెయిజర్‌ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థికమాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో బందీలయిన వేలాదిమంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్‌. ఆయన ఆ అవమానాన్ని దిగమింగు కోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్నది ఆయన విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు. వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు.అప్పటికే సంస్కృత భాషాధ్యాయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకొన్నారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయంలో మారణాయుధాల రహస్యాలున్నాయని ఆయన గ్రహించారు.

ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేశారు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఞ్మయం నుంచి జర్మన్లు అబ్ధిపొందడానికి గట్టిచర్యలు హిట్లర్‌ తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఞ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్‌ ప్రతినిధులు ఆయనకోసం అన్వేషణ ప్రారంభించారు.


Pages: 1 2

No comments:

Post a Comment

Featured Post

Central Finance Commissions since Independance

Finance Commission Year of Establishment Chairman Operational Duration First 1951 K.C.Neyogi 1952-57 Second 1956 K. Santhanam...

Popular Posts